చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చి వైద్యుడిని కాల్చి చంపిన యువకులు

చికిత్స పేరుతో ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వైద్యుడిని కాల్చి చంపారు. ఢిల్లీ జైత్‌పూర్ ప్రాంతంలోని నీమా ఆసుపత్రిలో నిన్న జరిగిందీ ఘటన. వైద్యుడిని జావేద్‌గా గుర్తించారు. ఆసుపత్రి సిబ్బంది కథనం ప్రకారం ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు యువకులు ఆ తర్వాత డాక్టర్ జావేద్‌ను కలవాలని అభ్యర్థించారు.

వారు ఆయన క్యాబిన్ ‌లోకి వెళ్లిన వెంటనే తుపాకితో జావెద్‌పై కాల్పులు జరిపి పరారయ్యారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Doctor Shot Dead
Delhi
Crime News

More Telugu News